స్టాక్ మార్కెట్లు నిన్నటి నష్టాలను పూడ్చుకునే పనిలో పడ్డాయ్.
సెన్సెక్స్ 650 పాయింట్లు వరకూ దంచికొట్టేసింది. ఇంట్రాడేలో ఇప్పటికే 71999 పాయింట్లను కింది. కాసేపట్లో ఆ 72వేలపాయింట్ల మార్క్ తిరిగి అందుకోనుంది. మరోవైపు నిఫ్టీ 200 పాయింట్లు వరకూ లాభపడి 21710 పాయింట్లకు ఎగబాకింది.
బ్యాంక్ నిఫ్టీ ఒకశాతం వరకూ లాభపడింది,ఐటీఇండెక్స్ ఒకటిన్నరశాతం ర్యాలీ చేసింది. కేపిటల్ గూడ్స్, మెటల్ సెక్టార్లు ఒకటింబావు శాతంవరకూ లాభపడగా, అన్ని రంగాలు షేర్లూ లాభంతో ట్రేడవుతున్నాయ్
అదానీ ట్విన్స్, టాటామోటర్స్, హీరోమోటోకార్ప్, బజాజ్ ఆటో టాప్ 5 గెయినర్లుగా ఒకటిన్నర నుంచిమూడున్నరశాతంవరకూ లాభపడగా, నెస్లే,ఓఎన్‌జిసి, బ్రిటానియా, యూపిఎల్, HDFC లైఫ్ కంపెనీల షేర్లు స్వల్పం నుంచి ఒకశాతం వరకూ నష్టపోయాయ్

Comments
Post a Comment