మార్కెట్లు కొత్త వారాన్ని లాభంతో ప్రారంభించి నష్టాల్లోకి జారుకున్నాయ్సెన్సెక్స్ 72181 పాయింట్ల వరకూ పెరిగి 71813 పాయింట్లకు జారిందిఇంట్రాడేలో 300 పాయింట్ల స్వింగ్ నమోదు చేసిందినిఫ్టీ 21763 పాయింట్ల వరకూ పెరిగి 21644 పాయింట్లకు తరిగింది.
ప్రస్తుతంఓ 30 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ ఓ పావుశాతం,ఐటి ఇండెక్స్ అరశాతంవరకూ నష్టపోగా, ఎఫ్ఎంసిజి సెక్టార్ ఒకశాతం నష్టపోయింది. ఆయిల్ అండ్ గ్యాస్ పిఎస్ఈ స్టాక్స్ ఓ పావుశాతానికిపైగా లాభంతో ట్రేడవుతున్నాయ్.
నిఫ్టీ50లో బజాజ్ ఫైనాన్స్, హీరోమోటోకార్ప్, హెచ్‌సిఎల్ టెక్, ఓఎన్‌జిసి, ఐషర్ మోటర్స్, ముప్పావుశాతం నుంచి ఒకటిన్నరశాతం వరకూ లాభపడ్డాయి. లూజర్లలో యుపిఎల్,దివీస్ ల్యాబ్స్,టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, హిందుస్తాన్ యునిలీవర్, బ్రిటానియా ఒకటింబావు నుంచి రెండున్నరశాతం వరకూనష్టపోయాయ్

Comments
Post a Comment