సేమ్ నిన్నలానే..

 మార్కెట్లు రెండోరోజు కూడా లాభంతో ప్రారంభం అయ్యాయ్. నిఫ్టీ ఓపెనింగ్‌లోనే 22వేల పాయింట్లను
టచ్ చేసింది.దీంతో సెంటిమెంట్ లెవల్‌ని మరోసారి అందుకున్నట్లైంది.నిఫ్టీ ప్రస్తుతం ఓ నలబై పాయింట్ల
లాభంతో ట్రేడవుతోంది
సెన్సెక్స్ 72559 పాయింట్లకు జంప్ చేసి..తిరిగి 300 పాయింట్లు కోల్పోయింది. వెరసి ప్రస్తుతం
75 పాయింట్ల లాభంతో 72263 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది


ఐటీ,టెక్ షేర్లలో మినహా అన్ని సెక్టార్లూ లాభంతోనే ట్రేడవుతున్నాయ్. మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్
సెక్టార్లలో ర్యాలీ కొనసాగుతోంది.బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్‌గా ట్రేడవుతోంది.

 టాప్ గెయినర్లుగా హెచ్‌డిఎఫ్‌సి లైఫ్
ఎస్బీఐ,యాక్సిస్ బ్యాంక్, కోల్ఇండియా,హిందాల్కో  ఒకటిన్నర నుంచి మూడున్నరశాతం వరకూ లాభపడ్డాయ్


టాప్ 5 లూజర్లుగా ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఐషర్ మోటర్స్ ,విప్రో అరశాతం నుంచి ఒకటిన్నరశాతం
వరకూ నష్టపోయాయ్. ఈ లిస్టులో ఐటి స్టాక్స్ నిన్న భారీగా పెరిగినవే..అంటే క్లియర్‌గా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం తప్ప
వేరొకటి కారణం కాదని తెలుస్తోంది. ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా..ఇంకో గంటలో ఇవన్నీ లైమ్‌లైట్‌లోకి వచ్చినా రావచ్చు

Comments