వరసగా రెండో రోజూ యెస్...ఇప్పడు ఓకే కానీ..రేపు అది కానీ తెలిస్తే


యెస్ బ్యాంక్ షేరు రెండో రోజూ పరుగు పెడుతోంది. ఇప్పటికే ఈ బ్యాంక్ స్టాక్ 

12శాతం వరకూ పెరిగి రూ.28.05కి చేరింది. ఇది ఈ స్టాక్‌కి ఈ ఏడాదిలో గరిష్ట స్థాయి



ఆర్బీఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి యెస్ బ్యాంక్‌లో వాటా కొనుగోలుకి రెండురోజుల క్రితం అనుమతి

ఇచ్చింది. ఇది  దాదాపు పదిశాతం వాటాకి సమానం..ఏడాదిలోపు వాటా కొనుగోలు చేయాల్సి ఉంటుంది

ఈ వార్త బ్రేకైన దగ్గరనుంచి స్టాక్ జుయ్‌మంటూ దూసుకుపోతోంది. HDFC బ్యాంక్ ఎన్ని విడతలుగా

ఏ రేటు దగ్గర ఈ వాటా కొంటుందో కానీ..మన ఇన్వెస్టర్లు మాత్రం పొలోమంటూ పరుగులు పెడుతున్నారు

సపోజ్..రేపొద్దున్న HDFC బ్యాంక్ ఈ వాటాల కొనుగోలు కోసం ఏ 22 రూపాయలో..లేదంటే 20 రూపాయలో ఫ్లోర్ ప్రైస్

ఫిక్స్ చేసిందనుకోండి..అప్పుడు మళ్లీ స్టాక్ అంతే వేగంగా కిందకు వస్తుంది. అంతేకానీ..బ్యాంక్..ఈ ఫ్లోర్ ప్రైస్‌ దగ్గర కొంటుంది..

తిరిగి తనకి భారీగా లాభం వచ్చేంత వరకూ వెయిట్ చేయగలదు..అనే ఆలోచన చేయరు(అందరూ కాదు) 


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి యెస్ బ్యాంక్ షేర్లు రూ.27.75 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments