మంగళవారం మార్కెట్లు కొద్ది లాభంతో ప్రారంభమై..అక్కడక్కడే ట్రేడవుతున్నాయ్
ఇంట్రాడేలో నిప్టీ 100 పాయింట్లు లాభపడి 21877 పాయింట్ల వరకూ చేరింది
సెన్సెక్స్ మరోసారి 72వేల పాయింట్లను అధిగమించింది.
బ్యాంక్ నిఫ్టీ అరశాతం నష్టపోగా, ఐటీ ఇండెక్స్ 2శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ ముప్పావుశాతం లాభపడింది. ఆటో
సెక్టార్ ఒకశాతం ర్యాలీ చేసింది
ఎఫ్ఎంసిజి,మెటల్, పిఎస్ఈ సెక్టార్లలో మాత్రమే నష్టాలు కన్పిస్తుండగా..మిగిలిన అన్ని రంగాలు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయ్
నిఫ్టీలో HDFC లైఫ్, భారతి ఎయిర్‌టెల్, టిసిఎస్, విప్రో, మారుతి సుజికి రెండున్నర నుంచి మూడున్నరశాతం వరకూ
లాభపడ్డాయ్. లూజర్లలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఐటిసి, బ్రిటానియా, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందాల్కో
ఒకటిన్నర నుంచి మూడున్నరశాతం నష్టపోయాయ్. పవర్ గ్రిడ్ స్టాక్ నిన్న భారీగా లాభపడగా..ఇవాళ
ప్రాఫిట్ బుకింగ్ ఎదుర్కొంటోంది

Comments
Post a Comment