పేటిఎంలో కొనసాగుతున్న పతనం, HDFC బ్యాంక్‌ చేసిన పుణ్యమేంది..PAYTM చేసిన పాపమేంది



పేటిఎం స్టాక్ ఈ రోజు మరో 20శాతం పతనం చోటుచేసుకుంది.దీంతో రెండంటే రెండే సెషన్లలో ఈ స్టాక్ 40శాతానికిపైగా నష్టపోయింది. మార్కెట్ కేపిటలైజేషన్, పరపతి, సంపద అంతా కూడా హరించుకుపోతుండగా, ఇన్వెస్టర్లు చేష్టలుడిగి చూస్తుండాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ సంస్థపై ఆర్బీఐ విధించిన ఆంక్షల ఫలితం ఇది కాగా..ఇక్కడ ఓ మౌలికమైన

ప్రశ్న వేస్తే తప్పేం కాదనిపిస్తుంది.


HDFC బ్యాంక్‌లో ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు..ఇతరత్రా అంశాలతో అమ్మకాలు సాగుతుంటే..ఎల్ఐసి అదనంగా

వాటా కొనడానికి ఆర్బీఐ,సెబీ సహా అన్ని ప్రభుత్వ సంస్థలు ముందుకు వచ్చాయి కానీ పేటిఎం మాత్రం అలా కాదా..?

కైవైసీ అనుచిత విధానాల కారణంగా సంస్థ తప్పులు చేసిందనుకుంటే..ఇదే తరహా కాకపోయినా...HDFC విషయంలోనూ

గతంలో క్రెడిట్ కార్డుల జారీపై ఆర్బీఐ బ్యాన్ విధించింది. మరి లోపం ఎక్కడుంది..?  పేటిఎం పై జెఫ్రీస్ సంస్థ అయితే

ఏకంగా సగానికి సగం టార్గెట్ ప్రైస్ కోసేసింది. పేటిఎం చేస్తోన్న లోన్ల వ్యాపారంపై ఇది ప్రభావం చూపుతుందని..ఇతరత్రా

భాగస్వాములు ముందుకు రారని తన వాదన తాను చెప్పింది. మాక్వేరీ అయితే..ఇప్పట్లో పేటిఎం సమస్యలకు పరిష్కారమే

కనబడటం లేదని చెప్పుకొచ్చింది. 


వీటన్నిటికి కూడా రేపొద్దున్న ఆర్బీఐ తన ఆంక్షలను సడలించిందనుకోండి..గొప్ప పరిష్కారం లభించినట్లే అవుతుంది..అఫ్‌కోర్స్ 

అది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం. ఇక్కడ నిశితంగా పరిశీలిస్తే..కేవలం లెండింగ్ వ్యాపారం మాత్రమే ఆపమన్నదా..అసలు

పేటిఎం ద్వారా జరిగే ఏ నగదు బదిలీనైనా ఆపమన్నదా అనేది చూడాలి. 


అత్యంత దారుణ పరిస్థితుల్లో కంపెనీ ఎబిటాపై ఇది రూ.300-500కోట్లమేర నష్టపరుస్తుందని..

ఎర్నింగ్ పర్ షేర్ విషయంలో 5.-15శాతం నెగటివ్ ఎఫెక్ట్ పడుతుందని పేటిఎం ప్రకటించింది. ఇలాంటి సిచ్యుయేషన్‌లో

పేటిఎం షేరుని కొనుగోలు చేయడం ఓ వంద అడుగుల బావిలోకి దూకడమే..! అందులో నీళ్లున్నా..లేకపోయినా !

Comments