PAYTM షేర్ల నష్టాలకు ఇవాళ బ్రేక్ పడింది. ఇంట్రాడేలో షేరు రేటు 8 శాతంలాభపడింది కూడా..!
మరోవైపు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ ..పేటిఎం నుంచి ఇతర ప్రత్యామ్నాయ పేమెంట్ అప్లికేషన్లవైపు
మళ్లాలంటూ సూచన జారీ చేసింది. ఐతే స్టాక్ ఇలా లేవడానికి ప్రత్యేకించి కారణాలేవీ కన్పించడంలేదు. ఓ వైపు రిలయన్స్
ఈ పేమెంట్స్ బ్యాంక్ వ్యాపారాన్ని టేకోవర్ చేస్తుందనే..ప్రచారంకూడా ఓ కారణం అయి ఉండొచ్చు..అసలు ఆర్బీఐ ఈ సంస్థపై
విధించిన ఆంక్షల నేపథ్యంలో మరో సంస్థ ఇలా ముందుకు రావచ్చా అనేది తేలాల్సి ఉండగా..సంస్థ ఫౌండర్ తొందర్లోనే
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌ని కలవబోతున్నట్లు చెప్పారు
స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి పేటిఎం రూ.452.90 దగ్గర ట్రేడ్ అయింది

Comments
Post a Comment