మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతోంది. ఈ రోజు నిఫ్టీ ఇంట్రాడేలో 21963
పాయింట్ల వరకూ పెరిగింది. సెన్సెక్స్ 900 పాయింట్లు పెరిగి
72543 పాయింట్లకు ఎగసింది
నిఫ్టీ బ్యాంక్ ఒకశాతం లాభపడగా, ఐటీఇండెక్స్ 2శాతం దంచికొట్టేసింది. అన్నిసెక్టార్లూ లాభాల్లోనే సాగుతుండగా
ఆయిల్ అండ్ గ్యాస్, పిఎస్ఈ షేర్ల హవా ఓ రేంజ్‌లో సాగుతోంది.
నిఫ్టీప్యాక్‌లో టాప్ గెయినర్లలో బిపిసిఎల్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ,అదానీ పోర్ట్స్, హీరోమోటోకార్ప్,ONGC మూడు నుంచి
ఆరుశాతం వరకూ లాభపడ్డాయ్. ఐషర్ మోటర్స్, హెచ్‌డిఎఫ్‌సిలైఫ్, యాక్సిస్ బ్యాంక్, హిందుస్తాన్ యునిలీవర్, మారుతి సుజికి
స్వల్పంగా నష్టపోయాయ్. వీటిలో ఐషర్ మోటర్స్ ఒకటే రెండుశాతం నష్టపోయింది

Comments
Post a Comment