ఆస్తిఎంత ఉన్నా...ఆరోగ్యం లేకపోతే..మనం ఏమీ చేయలేం

 ఆస్తిఎంత ఉన్నా...ఆరోగ్యం లేకపోతే..మనం ఏమీ చేయలేం

ఈ రోజు మా పెద్ద బాబాయిగారిని చూసిన తర్వాత ఈ నిజం మరోసారి కన్పించింది

ఆయన ఎంత ఆస్తి సంపాదించాడో చెప్పలేం( అలాగని కోట్లకి కోట్లు కూడబెట్టాడని కాదు) తన బంధువుల్లో

చాలామందికి సాయం చేశారు. అలాంటి మనిషి కేవలం షుగర్ పెరిగి..దానికి ముందు కరోనా కొట్టిన దెబ్బతో

పార్కిన్‌సన్స్ బారినపడ్డారు. ఇప్పుడు పూర్తిగా మంచానికి పరిమితమై..బాల్యంలో ఎలా ఉండేవాడో అలా అయిపోయాడు

ఏం మాట్లాడుతున్నారో ఆయనకి స్పృహ ఉందీ లేనిదీ తెలియడం  లేదు..ఈ రోజున ఎంతటి ఖరీదైన వైద్యంకూడా

ఆయనికి నయం చేయలేదు..ఇది చూసిన తర్వాతైనా డబ్బుతోనే అన్ని అయిపోతాయనే భ్రమ నుంచి బైటికి రావాలి

చిన్నప్పట్నుంచి  ఆయన్ని గమనించిన నాకు..ఇది అసలు మింగుడుపడని విషయం..మనుషులు చుట్టూఉండి పలకరిస్తుంటే

ఆ కాసేపు పర్లేదు కానీ..శరీరం అంతా శుష్కించుకుపోయి..అల్లాడిపోతుంటే..చూసేవాళ్లకే బాధగా ఉంటే..ఇక అనుభవించేవాళ్లకి ఎలాఉంటుంది


డబ్బు కావాల్సిందే కానీ..మా నాన్నగారి చివరి రోజులు కూడా ఇలానే గడిచాయి..ఆయన కూడా ఎంతమందికి ఎంత సాయం

చేశారో నాకు తెలుసు..అవన్నీ అక్కరకు రాకుండా పోయాయ్. ఇప్పుడీయన వంతు వచ్చింది. వీళ్లు జీవితంలో వ్యాయామం అంటే

ఎరుగరు..అలానే కొన్ని దురలవాట్లు కూడా ఇలాంటి స్థితికి కారణమేమో అన్పిస్తుంది. అలానే పిల్లల ఆదరణ కూడా వీరికి తక్కువే

అలాగని నిర్లక్ష్యం చేశామని కాదు కానీ చేయాల్సినంత చేయలేదేమో అనిపిస్తుంటుంది..సుబ్బరాజుగారి కుటుంబం సినిమాలో 

అనుకుంటా దాసరి సురేష్ క్యారెక్టర్తో అంటాడు..నీరు కిందకే ప్రవహిస్తుంది కానీ పైకి కాదు అలానే..పిల్లలపై ప్రేమ కింది తరాలకే కానీ..పైకి

పాకదు అని..అందులో కాస్తనిజం ఉంది..కానీ చూస్తుండగానే మనుషులు ఇలా జారిపోయి రాలిపోవడం మాత్రం ఒక్కోసారి..ఛీ..అసలు డాక్టర్లు

ఎందుకు ఇలాంటి వాటిని నయం చేయలేరని కూడా ఒక్కోసారి చిరాకుగా అనిపిస్తుంది..ఇలాంటివి చూసిన తర్వాతైనా కాస్త పిల్లలు తల్లిదండ్రులకు

దగ్గరగా మెసలాలి అనిపిస్తుంది...ఎందుకంటే మనుషులు పోయిన తర్వాత ఎంత ఫీలైనా ప్రయోజనం లేదు..దేశాలకు..విదేశాలకు పరిగెత్తి బొ్చ్చు

పీకేదేం ఉండదు..ఎందుకంటే..ఇదే వయసు అందరికీ వస్తుంది...అప్పుడు మనకి కూడా ఇదే రకమైన నిరాదరణ ఎదురు చూస్తుంటుంది

Comments