మార్కెట్లలో సహనం..మన రేటు వచ్చేవరకూ ఎదురుచూడగల ఓపిక ఉంటే రివార్డులు దక్కుతాయనడానికి ఛంబల్ ఫర్టిలైజర్స్ స్టాక్ మరో ఉదాహరణగా నిలిచింది. ఈ స్టాక్ గత వారం రోజులుగా మంచి స్పీడ్ ప్రదర్శిస్తోంది
ఈ స్టాక్ గత ఏడాదిలో రూ.325 తాకిన అనంతరం అప్పట్నుంచి నేల చూపులు చూస్తూనే ఉండిపోయింది. బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్నవాళ్లు..ఎరువుల కంపెనీలకేదో సబ్సిడీలు ఇస్తే ఈ స్టాక్ కూడా పెరుగుతుందనే అంచనాలో ఉండిపోయారు. ఐతే ఆ బడ్జెట్ రానూ వచ్చింది..మరో కొత్త బడ్జెట్ కూడా రాబోతోంది. ఇదే రంగంలోని
GNFC కూడా ఏడాది కాలపరిమితిలో చక్కని లాభమే ఇవ్వగా ఇది మాత్రం డౌనైంది. ఐతే ఇప్పుడు మాత్రం సీన్ మారిపోయింది. ఉన్నట్లుండి స్టాక్ వరసగా 52వీక్స్ హై రేటుని మంచి గ్యాప్‌తో సరి చేస్తూ పోతోంది.
నిన్న 328 రూపాయల దగ్గర 52వీక్స్ క్రాస్ చేయగా..ఇవాళ చంబల్ ఫర్టిలైజర్స్ మరో 5శాతం పెరిగి రూ.346.25కి చేరింది. స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి రూ.344.25 దగ్గర ట్రేడ్ అయింది
పైగా ఈ కౌంటర్ వాల్యూమ్స్ కూడా ఏకంగా 61లక్షలు దాటిపోయాయ్. దీంతో ఈ కౌంటర్‌లో భారీ డీల్స్ చోటు చేసుకుని ఉఁటాయనే సందేహం కలుగుతోంది
Comments
Post a Comment