డిసెంబర్ 8తో ముగిసిన వరుసగా ఆరవ వారంలో మార్కెట్ విజయ పరంపర కొనసాగించింది
గ్లోబల్ క్యూస్ పాజిటివ్‌గా ఉండటం, బలమైన జిడిపి డేటా, 3 రాష్ట్రాల్లో బిజెపి భారీ విజయంతో పాటు ఐదవసారి వడ్డీరేట్లు మార్చకుండా ఉండటంతో..ఈ విజయం సాధ్యపడింది.
గడచిన వారంలో బిఎస్‌ఇ సెన్సెక్స్ 3.47 శాతం(2344.41 )పాయింట్లు పెరిగి 69,825.60 వద్ద ముగియగా, నిఫ్టీ 701.5 పాయింట్లు( 3.46 శాతం) పెరిగి 20,969.40 వద్ద ముగిసింది. శుక్రవారంనిఫ్టీ మొదటిసారిగా 21,000 మార్కును దాటి 21,006.10కి చేరుకుంది. BSE సెన్సెక్స్ కూడా 69,893.80 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది.
బీభత్సంగా పెరిగిన ఇండెక్స్‌లలో బిఎస్‌ఇ పవర్ ఇండెక్స్ 13 శాతం, బిఎస్‌ఇ ఆయిల్ & జిఎ ఇండెక్స్ 7.6 శాతం, బిఎస్‌ఇ బ్యాంక్ ఇండెక్స్ 5.3 శాతం మరియు బిఎస్‌ఇ ఎనర్జీ ఇండెక్స్ 5.2 శాతం పెరిగాయి. అయితే బీఎస్‌ఈ ఎఫ్‌ఎంసీజీ సూచీ 0.3 శాతం నష్టపోయింది
ఈ వారంలో, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) రూ. 9,285.11 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐలు) రూ. 4326.47 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.
దంచికొట్టినస్మాల్ క్యాప్‌లో స్పెన్సర్ రిటైల్, BCL ఇండస్ట్రీస్, 63 మూన్స్ టెక్నాలజీస్, ఐనాక్స్ విండ్, పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ, HLV, సండూర్ మాంగనీస్ అండ్ ఐరన్ ఓర్స్, న్యూఢిల్లీ టెలివిజన్, KIOCL, Ashapura Minechem, Inox గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్, సంగమ్ (ఇండియా) 20-51 శాతం మధ్య పెరిగాయి.
Comments
Post a Comment