గురువారం పెద్దఉరుములు మెరుపులులేకుండానే మార్కెట్లు ప్రారంభం అయ్యాయ్
20941 పాయింట్ల వరకూ వెళ్లిన నిఫ్టీ అక్కడ్నుంచి కిందకు పయనిస్తోంది.
సెన్సెక్స్ 69320 పాయింట్ల వరకూ పతనం అయింది.ఇంట్రాడేలో 325 పాయింట్లకిపైగా
నష్టపోయింది
బ్యాంక్ నిఫ్టీ అరశాతం నష్టపోగా, ఐటీఇండెక్స్ ఫ్లాట్‌గా సాగుతోంది. ఆటో ఇండెక్స్
ఒకశాతం లాభంతో కేపిటల్ గూడ్స్ పావుశాతం నష్టంతో సాగుతున్నాయ్.ఆయిల్ అండ్
గ్యాస్ సెక్టార్ పాజిటివ్‌గా ట్రేడవుతోంది. మెటల్ ఇండెక్స్ అరశాతం నష్టపోగా
ఎఫ్ఎంసిజి సెక్టార్ ఒకశాతం నష్టపోయింది
మారుతి సుజికి, పవర్ గ్రిడ్, ఐషర్ మోటర్స్, అదానీ పోర్ట్స్, డా.రెడ్డీస్ ల్యాబ్స్
ఒకటింబావు నుంచి 3శాతం వరకూ లాభపడ్డాయి. ఓఎన్‌జిసి,భారతి ఎయిర్ టెల్, హెచ్‌యుఎల్
అపోలో హాస్పటల్, ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటింబావు నుంచి రెండుంబావు శాతం వరకూ నష్టపోయాయ్
Comments
Post a Comment