అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ రేటు ఇవాళ కూడా దంచి పారేస్తోంది
ఇంట్రాడేలో దాదాపు పదిశాతం పెరిగి రూ.2784కి చేరింది. దీంతో మార్కెట్ కేపిటలైజేషన్
కూడా 3.15లక్షల కోట్లను సాధించింది. ఇది జనవరి నాటి పతనంతోపోల్చితేతక్కువే అయినా
తిరిగి రివైవ్ అవుతుండటం గమనించదగ్గ అంశం
మరో స్టాక్ అదానీ పోర్ట్స్ మరోసారి తన 52వీక్స్ హై రేటుని దాటేసింది. రూ.966.50 దగ్గర
బ్రేక్ వేసింది. ఈ స్టాక్ మార్కెట్ కేపిటలైజేషన్ కూడా 2లక్షల కోట్ల రూపాయలను దాటేసింది
ఇక అదానీ గ్రూప్‌కి సంబంధించిన అన్ని సంస్థల మార్కెట్ కేపిటలైజేషన్ నిన్న 12లక్షలకోట్లకి చేరిందనే
వార్త నిన్న భారీగా చక్కర్లు కొట్టింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలు, సెబీ ఎంక్వైరీ భయాలు కాస్త తొలిగిపోవడంతో పాటు
ఎన్డీఏ 2024లోనూ అధికారంలోకి రానుందనే అంచనాలే ప్రస్తుత జోరుకు కారణాలు కాగా..టోటల్ మార్కెట్ కండిషన్
బుల్లిష్‌గా ఉండటం ప్రధాన కారణంగా చూడొచ్చు
పొలిటికల్‌గా మాత్రం ప్రభుత్వం మారితే రెగ్యులేటరీ ఎంక్వైరీ జరుగుతోన్న ఈ గ్రూప్‌కి ఝలక్ పడొచ్చనే రిస్క్‌ని
మాత్రం ఎప్పుడూ మర్చిపోరాదు
Comments
Post a Comment