ఏ రోజుకారోజే సెటిల్మెంట్...ఐపిఓకి అప్లై చేసినా..డబ్బెక్కడకీ పోదు

 ఇన్వెస్టర్ల ప్రయోజనంకోసం ట్రేడింగ్ లో ASBA సదుపాయం తెస్తున్నట్లు సెబీ ప్రకటించింది. ఆ సంస్థ చీఫ్ మదాబీ పూరీ


ఇలా ప్రకటించగా..ట్రేడ్ సెటిల్మమెంట్ కూడా ఒకే రోజులో పూర్తయ్యేలా జనవరి నుంచి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు

ఇది అమల్లోకి వస్తే ట్రేడర్లు, ఇన్వెస్టర్లకు చేతుల్లో డబ్బు ఎప్పటికప్పుడు చేరుతుంటుంది( ఖాతాల్లో). 


ఈ అస్బా ప్రయోజనం ఏంటంటే..ఫలానా ఐపిఓలకు అప్లై చేసినప్పుడు మన బ్యాంక్ అక్కౌంట్లనుంచిడబ్బు ఐపిఓల ఎస్క్రోల ఖాతల్లోకి వెళ్తాయ్..స్టాక్స్

అలాట్ కానప్పుడు వారి తిరిగి వెనక్కి పంపడానికి పట్టే సమయం వారం నుంచి పదిరోజులు పట్టవచ్చు..కానీ ఈ ASBAతోజస్ట్ ఫండ్స్ ఫ్రీజ్ మాత్రమే

అవుతాయ్.. ఆతర్వాత షేర్లు అలాటైతే ఓకే..లేదంటే మన డబ్బు తిరిగి మన ఖాతాల్లోనే వెంటనే రిలీజ్ అవుతాయ్.


 ఈ సదుపాయం అమలు వల్ల ఏటా పెట్టుబడిదారులకు 3 వేల 500 కోట్ల వరకు ఆదా అవుతాయని సెబీ అంచనా

అంతేకాదు డబ్బా ట్రేడింగ్‌కికూడా అడ్డుకట్ట పడినట్లే భావించాలి. 

Comments