నిఫ్టీ పరుగో పరుగు, ఆల్ టైమ్ రికార్డుల వరద

 


స్టాక్ మార్కెట్లు ఫ్రైడే ఆర్బీఐ ఇచ్చిన ఊతంతో పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయ్

నిఫ్టీ ప్రారంభం నుంచి లాభంతో ట్రేడవుతూ 21వేల పాయింట్ల మార్క్‌ని అధిగమించి 21005 

పాయింట్ల దగ్గర చేరి..తిరుగుముఖం పట్టింది


సెన్సెక్స్ 69888 పాయింట్ల దగ్గర మరో శిఖరం తాకింది


బ్యాంక్ నిఫ్టీ అరశాతం లాభంతో..ఐటీ ఇండెక్స్ ముప్పావుశాతం

ర్యాలీ చేయగా, ఆటో సెక్టార్ మాత్రమే స్వల్ప నష్టాలతోట్రేడవుతోంది

మిగిలిన అన్ని రంగాలూ లాభంతోనే ఉన్నాయ్. మెటల్ స్టాక్స్

అన్నింటి కంటే ఎక్కువగా ఒకటిన్నరశాతం లాభపడ్డాయి


జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్టిపిసి, హెచ్‌సిఎల్ టెక్, యుపిఎల్, ఎల్టీఐ మైండ్ ట్రీ

ఒకటిన్నర నుంచి మూడుశాతంలాభంతో టాప్ 5 గెయినర్లుగా సాగుతుండగా, బిపిసిఎల్

మహీంద్రా  అండ్ మహీంద్రా , బజాజ్ ఫైనాన్స్, భారతి ఎయిర్ టెల్,  హీరోమోటోకార్ప్

అరశాతం నుంచి ఒకటిన్నరశాతం నష్టపోయాయ్

Comments