IPO ధమాకా కంటిన్యూస్..లైన్‌లో డోమ్స్


ఐదు ఐపిఓల్లో  4 బంపర్ సక్సెస్ కావడంతో..ట్రేడర్లు..ఇంకా ఐపిఓలు వస్తే బావుండనే ఆశలో ఉండగా..వారికి ఓ గుడ్ న్యూస్

DOMS ఇండస్ట్రీస్ లిమిటెడ్  13 డిసెంబర్ 2023న అంటే వచ్చే వారం బుధవారం ప్రైమరీ మార్కెట్‌కు రాబోతోంది. ఇష్యూ 13 డిసెంబర్ 2023న ప్రారంభమై 15 డిసెంబర్ 2023 ముగుస్తుంది. డోమ్స్ పెన్సిల్ తయారీదారు సంస్థగా ఉంది. ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.750 నుంచి రూ.790 గా నిర్ణయించారు. స్టేషనరీ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.1200 కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మధ్యనే ఫ్లెయిర్ రైటింగ్స్ ఐపిఓ సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ ఐపిఓపై అంచనాలు బానే ఉన్నాయ్


టి ప్లస్ త్రీ విధానం ప్రకారం డిసెంబర్ 18న డోమ్స్ ఇండస్ట్రీస్ ఐపీఓ షేర్లు కేటాయింపు ఉండనుంది. డోమ్స్ డిసెంబర్ 20న BSE, NSEలలో లిస్ట్ కానుంది. 



 గుజరాత్‌లోని వల్సాద్‌లో ఉన్న భారతీయ స్టేషనరీ మరియు ఆర్ట్ మెటీరియల్స్ తయారీ సంస్థ డోమ్స్ .. 1976లో రసిక్‌లాల్ అమృత్‌లాల్ రవేషియా, మన్సుఖ్లాల్ జమ్నాదాస్ రజనీచే R.R. ఇండస్ట్రీస్ అనే భాగస్వామ్య సంస్థగా కంపెనీ స్థాపించారు. కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ "DOMS"ను 2005లో ప్రారంభించింది. మనదేశంలో 'స్టేషనరీ , ఆర్డ్ ప్రొడక్ట్స్‌లో లీడింగ్ ప్లేయర్‌గాచెప్తుంటారు 


ఈ రూ.1200 కోట్లలో రూ.350 కోట్లు తాజా షేర్ల జారీ లక్ష్యం కాగా మిగిలిన రూ.850 కోట్లు ఆఫర్ ఫర్ సేల్

ఇక ఈ ఐపిఓ గ్రే మార్కెట్ ప్రీమియం ఏకంగా రూ.470 నడుస్తోంది.అంటే ఇదే ట్రెండ్ కొనసాగితే లిస్టింగ్ రోజున 1000 రూపాయలు కనబడటం ఖాయం..అదే మార్కెట్లలో

ఏదైనా కరెక్షన్ వస్తే మాత్రం ఆవిరి కూడా అంతే వేగంగా అవుతుంది

Comments