చిన్నపాటి మొత్తంలో ఇచ్చే లోన్లు ఇకపై తక్కువగా మంజూరు చేయనున్నట్లు పేటిఎం ప్రకటించిన తర్వాతస్టాక్స్ ఒక్కసారిగా కుప్ప కూలాయ్..ఏకంగా 20శాతం నేలకు కరుచుకుపోయాయ్. రూ.650.45కి చేరాయ్ఆ.ర్బీఐ అన్ సెక్యూర్డ్ లోన్లకురిస్క్ రిజర్వ్ మనీ పెంచిన తర్వాత కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఐతే ఇలాంటి లోన్లపైనే ఎక్కువ వడ్డీ వసూలు చేస్తుంటారు
అప్పుల ఎగవేత అనేది ఇలాంటి లోన్ల విషయంలో ఉన్నా కూడా ఓవరాల్‌గా కంపెనలకు ఎక్కువ మొత్తంలో మార్జిన్లు
లాభాలు మిగులుతుంది ఇందులోనే...! ఐతే ఆర్బీఐ నిర్ణయించిన విధంగా రిజర్వ్ క్యాష్ కేటాయించలేని సంస్థలు
ఇప్పుడా తరహా లోన్లపై వడ్డీ పెంచడం లేదంటే..తక్కువ చేయడం చేస్తున్నాయ్. ఈ క్రమంలోనే పేటిఎం ఇలాంటి
నిర్ణయం ప్రకటించింది.
భారీ సెక్యూర్డ్ లోన్ల కోసం కస్టమర్లు ఎంపిక చేసుకునే సంస్థలు వేరుగా ఉంటాయి కాబట్టి..బ్రోకరేజ్ సంస్థలు
పేటిఎం నిర్ణయంపై భిన్నంగా స్పందించి డౌన్ గ్రేడ్ చేయడం ప్రారంభించాయ్. ఈ క్రమంలోనే సంస్థ ఆదాయం తక్కువ
నమోదు అవుతుంది కాబట్టి..షేర్లలో సెల్లాఫ్ వచ్చింది. ఇది తాత్కాలికమా లేదా అనేది మరి కొన్ని సెషన్లలో తేలనుంది
అసలు పేటిఎం బయ్ నౌ పే లేటర్ స్కీమ్ రూపంలో సంస్థ మొత్తం ఆదాయంలో 55శాతం వస్తోంది. మరిప్పుడు అలాంటి కేటగరీకి
స్వస్థి చెప్పడం ఆదాయంలో చిల్లి పెట్టడం ఖాయమే కదా..!
స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి పేటిఎం షేర్లు రూ.662.30 దగ్గర ట్రేడ్ అయ్యాయ్
Comments
Post a Comment